
నగరపాలక సంస్థలో భారతరత్న డా.బి.ఆర్.అంబేడ్కర్ ఘన నివాళి.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్ర పటానికి మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ ఎన్.మౌర్య లు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమానత్వం, మానవ హక్కులు, విద్యా స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషి అపూర్వమైనవి అన్నారు. ప్రతిభ ఉంటే అందరిలో ప్రత్యేక గుర్తింపు సాధించవచ్చు అనేందుకు అంబేడ్కర్ నిదర్శనమని అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోని సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన చిరస్మరణీయుల బాటలో నేటి తరం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మునిసిపల్ ఇంజినీర్లు తులసికుమార్, గోమతి, డిసిపి మహా పాత్ర, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హాసీమ్, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.
