TEJA NEWS

భౌరంపేట్ గ్రామ పోచమ్మ దేవికి ఘటం కుండను సమర్పించిన గ్రామ పెద్దలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, భౌరంపేట్ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ఈరోజు గ్రామ ఆనవాయితీ ప్రకారం గ్రామ పెద్దలు ఘటం కుండను, డప్పు చప్పుళ్లతో ఘనంగా తీసుకెళ్ళి శ్రీ పోచమ్మ దేవికి సమర్పించారు. అనంతరం శ్రీ దుర్గా దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి, దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిద్దెల బాల్ రెడ్డి , సురేందర్ రెడ్డి , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , విష్ణువర్ధన్ రెడ్డి, మురళీ యాదవ్ , హన్మంత్ రెడ్డి , మహిపాల్ రెడ్డి , రాజు గౌడ్ , యాదయ్య గౌడ్ , నాగభూషణం , కమ్మరి శ్రీనివాస్, దుబ్బ విష్ణు , మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS