TEJA NEWS

భోగవల్లి శ్రీధర్ మృతి పార్టీకి తీరని లోటు : ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్ మృతిపై ఎమ్మెల్యే సుజనా చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీధర్ మృతి పార్టీకి, కుటుంబానికి తీరని లోటని అన్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీధర్ హఠాన్మరణానికి గురయ్యారు.
ఈ విషాద వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబానికి అండగా ఉంటుందని భరోసానిచ్చారు .
సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పోతిన భేసు కంటేశ్వరుడు, పట్నాయక్, పైలా సురేష్, పచ్చిపులుసు ప్రసాద్, బెవర శ్రీనివాస్, రుద్రపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.