TEJA NEWS

ఐనవోలు మండల కేంద్రము లోని మల్లికార్జున ఫంక్షన్ హాల్ నందు ఐనవోలు మండల రైతులకు భూ భారతి చట్టం పై నిర్వహించే అవగాహన సదస్సు కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రావీణ్య మరియు టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ:-….

మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేని ఎందుకయ్యా నాని నియోజకవర్గ ప్రజలు, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆశీర్వాదాలతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్మట్లు పేర్కొన్నారు. మామునూరు సభలో అనేక సమస్యలమయంగా ఉన్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారంగా భూసమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. సమస్యల మయంగా మారిన ధరణి పోర్టల్ స్థానంలో భూ సమస్యలు పరిష్కరించే విధంగా భూభారతి చట్టం నిలుస్తుందన్నారు. భూభారతి చట్టంతో భూ కబ్జాదారులకు వణుకు పుడుతుందన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటలపాటు అందుబాటులో ఉంటున్నారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు, నాయకులు ఎప్పుడు వెళ్లిన వెంటనే అపాయింట్మెంట్ లభిస్తుందన్నారు. ధరణిలో ఉన్న లోపాలు, ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి ప్రజలు, రైతుల అభిప్రాయాలను స్వీకరించడం జరిగిందన్నారు. అందరి అభిప్రాయాల మేరకు భూ భారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. అదేవిధంగా ప్రజలతో, ప్రజలందరి మధ్యలో ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండాలని తమకు సూచించారని అన్నారు. రైతు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పేదలకు సన్న బియ్యంను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిందని అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే ఊరుకునేది లేదన్నారు. భూ భారతి చట్టం జూన్ రెండవ తేదీ నుండి ఆన్లైన్ అవుతుందన్నారు. ఐనవోలు తహసిల్దార్, ఎంపీడీవో, పోలీస్ స్టేషన్ కార్యాలయ భవనాలకు ప్రారంభోత్సవం త్వరలో చేయనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు కాపాడుకునే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలందరిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్నారు….

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎంపీడీవో ఇంచార్జ్ రఘుపతి రెడ్డి, ఆర్టీవో రమేష్ రాథోడ్, మండల్ స్పెషల్ ఆఫీసర్, మండల వ్యవసాయ అధికారి సునీల్ కుమార్, ఎమ్మార్వో విక్రమ్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహరెడ్డి , హాసన్పర్తి పాక్స్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి సుధీర్ గౌడ్, మండల మహిళ అధ్యక్షురాలు ఎలీషా, ఇతర అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల రైతులు, ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు….