
రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవిన్యూ చట్టం పై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే జారె.
రైతు బాగుపడితే గ్రామం బాగుపడుతుంది – గ్రామం బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఎమ్మెల్యే జారె.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం
ములకలపల్లి మండలం.
తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ చట్టం పై అవగాహన కోసం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఆధ్వర్యంలో ములకలపల్లి మండల కేంద్రంలో రాయల్ ఫంక్షన్ హాల్ నందు,శాసనసభ్యులు జారె ఆదినారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్,శాసనసభ్యులు జారె ఆదినారాయణ మాట్లాడుతూ అనాదిగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలన్న సంకల్పంతో భూభారతి రెవిన్యూ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఈ చట్టం ద్వారా భూ నమోదు, నమూనా నిబంధనలు, హక్కుల గుర్తింపు పారదర్శకంగా వేగంగా పూర్తవుతాయని,పాత లోపాలను సరిదిద్దుతూ మీ భూమిపై మీ హక్కును పటిష్టం చేయడమే భూభారతి లక్ష్యం అన్నారు.
ఇప్పటివరకు భూ సంబంధిత సమస్యల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయబద్ధమైన సహాయం అందుతుందన్నారు. ఇప్పటి నుంచి రెవిన్యూ వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండనుందన్నారు.
ఈ సందర్భంలో ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించి వారిలో ఉన్న అనుమానాలు నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గుడ్ల పుల్లారావు, ఎంపీడీవో రేవతి, ఏడిఏ రవికుమార్, ఏవో అరుణ్ బాబు, మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు గుంపుల రవితేజ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
