Spread the love

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిక్కిం రాష్ట్రం హిమాలయాల్లో మొక్కలు నాటిన బోయినపల్లి వినోద్ కుమార్, శ్రీమతి డాక్టర్ మాధవి దంపతులు


తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, శ్రీమతి డాక్టర్ బోయినపల్లి మాధవి దంపతులు సిక్కిం రాష్ట్రం గ్యాంగ్ టక్ శివారులోని హిమాలయ పర్వత ప్రాంతంలో మొక్కలు నాటారు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్ర ప్రజలకు మరింత గొప్ప సేవలు అందించేందుకు శక్తి కలుగాలని వారు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కి వినోద్ కుమార్ , డాక్టర్ మాధవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.