
చిక్కం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకుడు జలగం వెంకట్రావు ఘనంగా జన్మదిన వేడుకలు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జలగం యువసేన బాధ్యతలు చిక్కం గోపాలకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక అమ్మ సేవాసదనంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు,బీజేపీ రాష్ట్ర నాయకులు జలగం వెంకటరావు పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. జలగం వెంకట్రావు పుట్టినరోజుని పురస్కరించుకొని పట్టణంలోని అమ్మ సేవాసదనంలో వృద్ధులకు పండ్లు స్వీట్లు పంచారు అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా జలగం యువసేన అశ్వరావుపేట బాధ్యులు చిక్కం గోపాలకృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జలగం కుటుంబం సేవలు అనిర్వచనీయమైనవి అని పేర్కొన్నారు.తరం తరం జలగం సేవలు నిరంతరం అని జలగం సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జలగం యువసేన బాధ్యులు చిక్కం గోపాలకృష్ణ, కోటగిరి మోహన్ రావు, ఫకీర్, నాయుడు శ్రీను,మూర్తి, రాజు, సాత్విక్, భార్గవ్ అశ్వారావుపేట మండల బీజేపీ నాయకులు మెట్ట వెంకటేష్, ఎస్వీటి కొండ,రాయుడు ఆంజనేయులు,పమిడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
