TEJA NEWS
  • అంగరంగ వైభవం గా కన్నుల పండుగ గా బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్ళ ఉత్సవాలు

చిలకలూరిపేట జాతీయ రహదారి ప్రక్కన వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం తిరునాళ్ల మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. 108లీటర్లు పాలు తో, వివిధ రకాల పండ్లతో, అభిషేకాలు నిర్వహించడం జరిగింది.

బెంగుళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన రంగు రంగుల పూలతో స్వామివారిని అందంగా అలంకరించారు.

చిలకలూరిపేటనియోజకవర్గం నుండే కాక, పలు గ్రామాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రసన్నాంజనేయ స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.

వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది

భక్తులు స్వామివారి కల్యాణాన్నితిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

గురువారం సాయంత్రందేవస్థానం ఎదుట భారీ విద్యుత్ ప్రభలు రంగు, రంగు ల విద్యుత్ లైట్ల తో దేవస్థానం మిరుమిట్లుగా ప్రకాశిస్తుంది