TEJA NEWS

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయాగాళ్లేనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో నిర్వహించిన కాలనీ ఆత్మీయ సమావేశంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని, దేశంలో ప్రశాంతమైన వాతావరణానికి కారణం మోడీ యేనని అన్నారు.


TEJA NEWS