TEJA NEWS

కవిత ను బైటకి తీసుకు రావడమే B R S ఫస్ట్ ప్రయార్టీ

ఎమ్మెల్సీ క‌విత జైలు కెళ్లి నెల‌లు గ‌డిచిపోతున్నాయి.

ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ మ‌నీష్ సిసోడియాకు కూడా ఇంతవ‌ర‌కు బెయిల్ రాలేదు

క‌వితకు కూడా వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేదు.

కానీ ఎలాగైనా బ‌య‌ట‌కు తీసుకురావాల‌న్న త‌ప‌న‌తో కేటీఆర్-హ‌రీష్ రావులు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు.

ఎంపీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే క‌విత‌తో ములాఖ‌త్ అయ్యేవారు. సీనియ‌ర్ లాయ‌ర్లు ఉన్నా కేసు అంత త్వ‌ర‌గా కొలిక్కి రాద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ ఎన్నిక‌లు పూర్త‌య్యాక కేటీఆర్-హ‌రీష్ రావులు రంగంలోకి దిగారు. మాజీ సీఎం కేసీఆర్ క‌విత‌ను ఇంత వ‌ర‌కు ప‌రామ‌ర్శించ‌లేదు… తాను జైలుకు వెళ్లి క‌ల‌వ‌కూడ‌ద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు పార్టీ వ‌ర్గాలంటున్నాయి.

క‌విత కోసం ఇటు సీనియ‌ర్ లాయ‌ర్లతో చ‌ర్చిస్తూనే తెర వెనుక బీజేపీతో మాట్లాడుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ రావ‌టం అంత హిజీ కాదు… బీజేపీతో మా వారు మాట్లాడుతున్న‌ట్లున్నారు అంటూ బీఆర్ఎస్ నేత‌లు ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఎలాంటి ఎన్నిక‌లు లేవు. అధికారం కూడా లేదు… బీజేపీతో కొట్లాట ఎందుకు? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాజకీయ ప‌రిస్థితులు ఎలా ఉంటాయో ఎవ‌రికి తెలుసు? ఇప్పుడు కొట్లాట క‌న్నా, విమ‌ర్శల క‌న్నా క‌విత బ‌య‌ట‌కు రావ‌ట‌మే త‌మ‌కు ముఖ్యం… ఎన్నిక‌ల నాటి ప‌రిస్థితులను బ‌ట్టి అప్పుడు నిర్ణ‌యాలుంటాయి అంటూ కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు కామెంట్ చేస్తున్నారు.


TEJA NEWS