దారి పొడవునా నీరాజనం..*
ఘన స్వాగతం పలికిన మండల నేతలు, నాయకులు
బొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు ప్రచారం..
మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి నీలం మదన్నకు వెల్దుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు నీరాజనం పలికారు. బొమ్మారం, కోప్పులపల్లి, నెల్లూరు నుంచి వెల్దుర్తి వరకు నీలం మధు ప్రచార రథంతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు, ముఖ్యులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ప్రచార రథం నుంచి నీలం మధు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మహిళ ఇన్చార్జి సుజాత సత్యం, సుహాసినిలు నీలం మధుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, ఎంపీపీ నరేందర్ రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి ఆంజనేయులు, మాజీ మండలాధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ లీడర్ నరసింహారెడ్డి, యూత్ లీడర్ మల్లేష్ చారి తదితరులు పాల్గొన్నారు.
నీలం మదన్నకు బ్రహ్మరథం..
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…