Spread the love

గవర్నర్ ప్రసంగంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదు

గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొస్తుందా ?

మీ ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో గాంధీ కుటుంబం బాధ్యత తీసుకోవాలి

గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారు

స్థానిక కాంగ్రెస్ నాయకులను చూసి ప్రజలు ఓట్లు వేయలేదు

బాధ్యత తీసుకొని గాంధీ కుటుంబం తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి

గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

ఎన్నికల సమయంలో గాంధీ కుటుంబం వచ్చి ఇచ్చిన హామీల అమలుపై ప్రస్తావనే లేదు

అబద్దాలనే మళ్లీ అందమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు

ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడుతాం

రూ లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసినా ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు

మహిళలకు నెలకు 2500 ఇస్తామన్న హామీని విస్మరించింది..