కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
తెలంగాణ రాష్ట్ర జాతి పీత, రాష్ట్రముని సాధించి పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ దిశగా నడిపించిన భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్ గారి 70 వ జన్మదిన సందర్భంగా పస్రా బి ఆర్ ఎస్ పార్టీ పస్రా గ్రామ అధ్యక్షులు తాటికొండ శ్రీనివాసచారి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఏకుల ధనంజయ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రక్తదాన శిబిరాన్ని మండల ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించాడు మండల వ్యాప్తంగా 47 మంది రక్తదానం చేశారు
ఈ సందర్బంగా వారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించిన తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మార్చిన ఘనుడు కెసిఆర్ అని వారు నిండు నూరేళ్లు కలకాలం సంతోషంగా ఉండాలి అని మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని,రాష్టంని సుభిక్షము వుండే విధంగా చూడాలి అని కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమం లో ఎంపిటిసి వెలిశాల స్వరూప, రాంనగర్ సర్పంచ్ మోహన్ రాథోడ్, మండల ప్రధాన కార్యదర్శి లాకావత్ నర్సింహా నాయక్, మండల ఉపాధ్యక్షుడు అజ్మీర సురేష్, గోవిందరావుపేట గ్రామ అధ్యక్షుడు అక్కినపల్లి రమేష్, బురెడ్డి మధుసూదన్ రెడ్డి, కృష్ణ,రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.