TEJA NEWS

బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉషోదయ కాలనీ ఫేజ్ -1 నూతన కార్యవర్గం సభ్యులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 125 – గాజుల రామారం డివిజన్ ఉషోదయ కాలనీ ఫేజ్ -1 కాలనీకి చెందిన నూతన సంక్షేమ సంఘం సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ…. నూతన సంక్షేమ సంఘ కార్యవర్గం కాలనీ అభివృద్ధిలో ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండి అందరినీ కలుపుకుంటూ కాలనీ సంక్షేమం కోసం పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో 125 – గాజుల రామారం డివిజన్ ఉషోదయ కాలనీ ఫేజ్ -1 కాలనీ నూతన అధ్యక్షులు డేగల సతీష్ బాబు, ప్రధాన కార్యదర్శి బి. నర్సింహా రెడ్డి, సలహాదారులు సుధాకర్ రెడ్డి, సభ్యులు మధుసూదన్ గుప్తా, డేవిడ్ రాజు, కె.శ్రీనివాస్, రసూల్, రమేష్, సోమశేఖర గౌడ తదితరులు పాల్గొన్నారు