TEJA NEWS

బుడమేరు సమగ్రాభివృద్ధికి పరిపూర్ణంగా నిధులు కేటాయించాలి.

ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసి విజ్ఞప్తి చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, బుడమేరు అభివృద్ధితో పాటు, గత ఏడాది ఆకస్మిక వరదల వల్ల మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా దెబ్బతిన్న వాగులు, చెరువులు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని కలిసి విజ్ఞప్తి చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గత ఏడాది సంభవించిన వరదల భీభత్సానికి మైలవరం నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందన్నారు. అప్పట్లో ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో 35 సెంటిమీటర్ల వర్షపాతం కురిసిందన్నారు. దీనివల్ల కోతులవాగు, పులివాగు, ఒకసారిగా వరద బీభత్సంతో పొంగి పొర్లాయన్నారు. పేర్కొన్నారు. ఈ వాగులు అన్ని బుడమేరులో కలుస్తాయన్నారు. వీటితోపాటు 50కి పైగా చెరువుల కట్టలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువలు, వాగులు, వంకలు కూడా చాలాచోట్ల గండ్లు పడి తెగిపోయాయని పేర్కొన్నారు.

బుడమేరు 70 శాతంకు పైగా మైలవరం నియోజకవర్గంలో ఉందన్నారు. దీనికి అనుబంధంగా ఉన్న కోతుల వాగు, పులివాగులు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల గ్రామాలకు రక్షణగా ఏర్పాటు చేసిన కరకట్టలు, పొలాలకు రక్షణగా ఏర్పాటు చేసిన కట్టలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయన్నారు. ఈ వాగులు పొంగిన కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా 50కి పైగా చెరువులు పూర్తిగా తెగిపోయాయన్నారు. వీటన్నింటిని మరమ్మతులు, ఇంకా వాగులు, చెరువులు, సాగర్ కాల్వల అభివృద్ధికి కూడా అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు.

గతంలో అప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన తాత్కాలికంగా గండ్లు పూడ్చగా, ఆయా చేసిన పనులకు దానికి కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. బుడమేరును, దానికి అనుబంధంగా ఉన్న కాల్వలను, వాగులను, చెరువులను శాశ్వతంగా అభివృద్ధి చేయాలన్నారు.

మైలవరం నియోజకవర్గంలో సాగునీటి పారుదల వ్యవస్థ సమగ్రాభివృద్ధికి పరిపూర్ణంగా నిధులు కేటాయించి, భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి ఈ పనులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కి వివరించినట్లు శాసనసభ్యులు కృష్ణప్రసాదు వెల్లడించారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.