
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలోని ప్రాగటూల్స్ వారు 32సం|| గా అక్కడ 119 ఇండ్లకు పైగా నిర్మించుకున్నారు ప్రస్తుతం అక్కడ బల్క్ వాటర్ కనెక్షన్ ప్రస్తుత నివాసితులకు ఇబ్బంది పడుతుందని వేరు వేరు కనెక్షన్ కొరకు స్థానిక నివాసితుల ఇబ్బందులను ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసి విన్నవించగా వెంటనే సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గౌ || శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు ధమ్మని శ్రావణ్ కుమర్, ప్రసాదా రావు , రామ్ బాబు, వి . సుదర్శన్ రెడ్డి, బల్ రెడ్డి, ఎల్ . సుదర్శన్ గౌడ్, పరమేశ్వర్ రావు, గంగాధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
