TEJA NEWS

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో పాల్గొన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్

ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు జూలియస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గం పాస్టర్లతో సమావేశం కు ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ గారు,
ఈ సందర్భంగా శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం లో క్రిస్టియన్ మినిస్ట్రీస్ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు, వారి సమస్యలను తీరుస్తా అని హామీ ఇచ్చారు, మీరందరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను అసెంబ్లీకి మరియు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపియవలసిందిగా కోరారు..

ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెలోషిప్ జనరల్ సెక్రెటరీ మనోహర్ గారు, జాయింట్ సెక్రెటరీ మహేష్ గారు కంటోన్మెంట్ క్రిస్టియన్ మైనారిటీస్ చైర్మన్ సామ్సన్ గారు, చోటుగారు,అంతోని జోసెఫ్ గారు మరియు పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


TEJA NEWS