TEJA NEWS

కాంగ్రెస్ భవన్ – 02-11-2024

రాష్ట్ర చరిత్రలో కుల గణన ఒక సువర్ణ అధ్యయనం..

పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కుల గణన నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం..

పార్టీ స్వలాభం కోసం కాదు ఇది..

ప్రజా అభ్యున్నతి, అభివృద్ధి, అన్ని కులాల సమూచిత స్థానం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అభిలాష…

మంచి పనిని మాటలతో తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నల్లో ప్రతిపక్షాలు..

దొంగ యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారు..

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సమూచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం..

తేదీ : 02/11/2024 – శనివారం,
డీసీసీ భవన్ – హనుమకొండ.

దేశ రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానం తీసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీలకు అతీతంగా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కుల గణన పక్రియ గౌ ముఖ్యమంత్రి, మంత్రుల, పార్టీ అధ్యక్షుల నాయత్వములో జరగనున్నదని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు అన్నారు. శనివారం రోజున హనుమకొండ డీసీసీ భవన్ లో ఏఐసీసీ ఆదేశాలనుసరం, టీపీసీసీ పిలుపు మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరిగిన కుల గణన సర్వే పై అవగాహన మరియు విస్తృత స్థాయి సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ,ఎమ్మెల్సి శ్రీ బస్వారాజు సారయ్య గారు,ఎమ్మెల్యేలు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, శ్రీ KR నాగరాజు గారు, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్ గార్లతో పాల్గొన్నారు.

దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని ఒక మహోన్నత కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే నాయిని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల జీవన, వైవిద్య అంశాలను సర్వే ద్వారా తీసుకుని అందరికీ లబ్ది చేకురే విధంగా కార్యాచరణ ముందుకు సాగుతుందని అన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూ సంస్కరణ చట్టం, MGNREGS చట్టం,SC, ST సబ్ ప్లాన్ తీసుకు వచ్చింది.

రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సామజిక,ఆర్థిక ప్రయోజనాలు సమాకుర్చాలానే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ల నాయకత్వములో మరింత పటిష్టం చేసే పక్రియ కొనసాగుతుంది.

గతపదేళ్లలో కుల గణన చేయలేక,కుటుంబ సర్వే నిర్వహించుకుని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు.

గత పదేళ్లలో ఒక్క పరీక్ష నిర్వహించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ పరీక్షలు నిర్వహిస్తే అగ్రవర్ణలకు లబ్ది చేకూరుతుందని తప్పుడు ప్రచారం చేశారు.

చాలా రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు బీసీలకు 52% శాతం కావాలని మాట్లాడిన ఇటీవలే నిర్వహీంచిన అన్ని పరీక్షల ఫలితాల్లో 57%శాతం బీసీ లకు రావడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకు, అన్నికులాలను సమదృష్టితో పరిపాలిస్తుంది.

పదేళ్ల బీజేపీ ప్రభుత్వంలో 2021లో జరగాల్సిన కులగణన ఇంత వరకు నిర్వహించిలేదు.

పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఒత్తిడి తో 2025లో కుల, జన గణన ఉంటుందని పలికారు.

రాజ్యాంగన్ని నిర్వీర్యం చేసే పక్రియలో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్లే పక్రియను కాంగ్రెస్ పార్టీ అడ్డుకట్ట వేసింది.

ఈ సమావేశంలో జిల్లా ప్రముక విశ్లేషకులు,బీసీ కుల నాయకులు, పెద్దలు వారి సూచనలు సలహాలను తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కురపాటి వెంకట నారాయణ, కేయు EC మెంబర్ పుల్లూరి సుధాకర్, తిరుణహరి శేషు ప్రజా ప్రతినిధులు,బీసీ సంఘాల అధ్యక్షులు,నాయకులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS