TEJA NEWS

తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సిబిఐ విచారణ జరిపించాలి

శంకర్పల్లి మండల భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర సింగ్

శంకరపల్లి, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రంలో లడ్డు వివాదం పై సిబిఐ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ మండల జనరల్ సెక్రెటరీ రాజేంద్ర సింగ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల పుణ్యక్షేత్రంలో లడ్డు నాణ్యత మరియు అందులో జంతువుల కొవ్వు వాడినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో నిజాలు బయటికి రావాలంటే సమగ్ర విచారణ అవసరమని అన్నారు. ఇలాంటి ఘటనలు జరగడానికి ముఖ్య కారణం అన్యమతస్తులను ఉద్యోగులుగా నియమించడమేనని తెలిపారు. ఈ చర్యలను మొదటి నుండి బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ,అయినా ఆయా ప్రభుత్వాలు చలనం లేకుండా వ్యవహరించాయని అన్నారు. ఈ యొక్క కల్తి నెయ్యిని వాడడం అనేది తిరుమల పవిత్రతను దెబ్బతీయటమేనని అన్నారు.అంతేకాకుండా యావత్ ఈ దేశంలోని హిందువుల మనోభావాలను కించపరచడమేనని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనియెడల బిజెపి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.


TEJA NEWS