
ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా వేడుకలు నిర్వహించారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం
గండుగులపల్లి:జారె ఆదినారాయణ స్థానిక క్యాంపు కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం చేసి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికుల కృషితోనే దేశ నిర్మాణం సాధ్యమవుతోందని గ్రామీణ స్థాయిలో పరిసరాలశుభ్రత త్రాగునీటిసరఫరా పారిశుధ్యం వంటి ప్రాథమిక అవసరాల నిర్వహణలో గ్రామపంచాయతీ సిబ్బంది పాత్ర ఎంతో గొప్పదన్నారు.వీరి సేవలకు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమలో భాగంగా కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు.
కార్మికుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
