TEJA NEWS

సీనియర్ పద్యకవికి చందాపురం బుచ్చయ్య ను ఘన సన్మానించిన సాహితి కళా వేదిక
వనపర్తి గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికి తన వంతుగా సేవలందిస్తున్న సీనియర్ పద్యకవికి సందాపురం బిచ్చయ్య ను సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ ఘనంగా సన్మానించారు.
వృత్తి రీత్యా హిందీ భాషోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేసిన సందాపురం బిచ్చయ్య ప్రవృత్తిగా తెలుగు సాహిత్య పద్యకవిగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాహితీ కళా వేదిక ప్రతినిధులు సోమవారం ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ హిందీ భాషా బోధనలో విద్యార్థులకు చక్కటి పాఠ్య బోధన చేసిన ఆయన తెలుగు సాహిత్యంపై కూడా అభిమానం పెంచుకొని దాదాపు ముప్పై శతకాలు ,ఇతర గ్రంథాలను వెలువరించారని చెప్పారు. అనేక స్వచ్ఛంద సాహిత్య సంస్థలతో పాటు హైదరాబాద్ తెలుగు విశ్వ విద్యాలయం వారు గత సంవత్సరం విశిష్ట పురస్కారాన్ని అందజేశారని తెలిపారు.
ఈనాటి కార్యక్రమంలో సాహితీవేత్తలు కందూరు నారాయణ రెడ్డి బైరోజు చంద్ర శేఖర్ డా.బి.శ్యాం సుందర్,బండారు శ్రీనివాస్,వెంకటేశ్వర్లు సురేష్,రాము తదితరులు పాల్గొన్నారు.