
పోలేరమ్మ తల్లి సేవలో పాల్గొన్న మండలనేని చరణ్ తేజ
చిలకలూరిపేట:
రాత్రి పురుషోత్తం పట్నం, శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానం పదవ వార్షికోత్సవం సందర్భంగా 108 కేజీల మల్లెపూలతో అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయకర్త రాజా రమేష్ , యువ నాయకుడు మండల నేని చరణ్ తేజ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఆలయ కమిటీ వారు మండలనేని చరణ్ తేజ కుతోట రాజా రమేష్ లకు పూల మాలలతో శాల్వలతో చిరు సన్మానం చేసారు అలాగే వేద పండితులతో అమ్మవారి ఆశీర్వచనం అందజేశారు,
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మునీర్ హసన్, కూరపాటి శివశంకర్, సాంబ, సూర్య, వెంకీ, అచ్చు కోల వెంకటప్పయ్య, అయ్యప్ప స్వామి నాయుడు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
