
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన……………
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి ఆకస్మికంగా సందర్శించి ,తనిఖీ చేశారు.
ఆసుపత్రి సిబ్బంది రిజిస్టర్ తనిఖీ చేశారు
ఆస్పత్రిలో అన్ని వార్డులు తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు
ఈ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడుతూ రోగుల ఆరోగ్య పరిస్థితిలపై ఆరా తీశారు .
ఆస్పత్రిలో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా డాక్టర్లు ,సిబ్బంది చూసుకోవాలన్నారు.
ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు.
ఆసుపత్రి లో ఉచిత త్రాగునీరు సమస్యను త్వరగా పరిష్కరించాలని మేనేజ్మెంట్ కి సూచించారు
ఎప్పటికప్పుడు రోగుల ను పరిశీలిస్తూ ఉండాలని అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
కార్యక్రమంలో వనపర్తి మండలం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్, వనపర్తి జిల్లా ఎఐపిసి ఉపాధ్యక్షులు నాగార్జున, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గట్టు రాజు తదితరులు పాల్గొన్నారు.
