
జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్….
తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించాం..
తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేసుకోబోతున్నాం
ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం
టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించాం.
నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక
మూసీ నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారు
ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి ఉంది
కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితి ఉంటే.. మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా..
అందుకే హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన చేయాలని నేను చెబుతున్నా..
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు
తెలంగాణలో పెట్టుబడులు పెరగాలి, పరిశ్రమలు పెరగాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం.
ఈ తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి సహకారం అవసరం
ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే.. ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చు
మీ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి
సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో మీకు తెలుసు..
