
చిలకలూరిపేట లోని ప్రముఖ స్వచంధ సేవా సంస్థ అసిస్ట్ మరియు హైదరాబాద్ లోని కే ఎన్ ఎ సంస్థ ద్వారా చిలకలూరిపేట లోని సుభానినగర్ కు చెందిన 200 మంది ఒంటరి మహిళలకు ఉచితంగా 3,00,000/- ల విలువ కలిగిన బియ్యం, కందిపప్పు, నూనె మరియు గోధుమ పిండి ఇవ్వటం జరిగింది. తమకు ప్రతినెలా ఉచితంగా నిత్యావసర సరుకులు ఉచితంగా ఇచ్చి తమను ఆదుకుంటున్నందుకు మహిళలు ఆనందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్ట్ సంస్థ అధినేత డాక్టర్ జాష్టి రంగారావు, కే ఎన్ ఎ సంస్థ నుండి అస్మా , అసిస్ట్ సంస్థ అసోసియేట్ డైరెక్టర్ ఎం. విష్ణుప్రియ, అసిస్ట్ సిబ్బంది మరియు మహిళలు పాల్గొన్నారు.
