ప్రపంచం అంతటా కాంతులను విరజిమ్మే పండుగ క్రిస్మస్ – ప్రత్తిపాటి పుల్లారావు
పేదరికం నుండి సంపదను సృష్టించే రాష్ట్రంగా చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నారు – ప్రత్తిపాటి పుల్లారావు
క్రీస్తు బోధనలు సమాజం అభివృద్ధి చెందడానికి, శాంతి స్థాపనకు కృషి చేస్తాయని మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సాయంత్రం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా దైవ జనులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ప్రత్తిపాటి పుల్లారావు కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీ ఒక్కరూ క్యాండిల్ ను వెలిగించి క్రీస్తు బోధనలు ఆలకించారు. . అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, ప్రపంచంలో దేవుని కూటములు జరిగితే,లక్షలాది మంది హాజరు అయ్యేది యేసు క్రీస్తు బోధనలు, కీర్తనలు కోసం మాత్రమేనని తెలిపారు .క్రీస్తు సందేశం కోసం లక్షలాది మంది సమూహంగా ఏర్పడటం చాలా గొప్ప విషయం అని కొనియాడారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా,పండగ కానుకను ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఒక్క చంద్రబాబు గారి ప్రభుత్వం మాత్రమేనని వారు తెలిపారు.
సమసమాజ స్థాపనకు,పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను పునఃనిర్మించటానికి కూటమి ప్రభుత్వం,చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. డా.బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచనలతో,వారి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తున్న చంద్రబాబు , పెరిగిన సంపదను పేదలకు పంచే విధంగా ప్రణాళిక అమలు చేస్తున్నారని వారు తెలిపారు.రాష్ట్రంలో 50 లక్షల మందికి పైగా దళితులు వున్నారని, వారిలో ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారని, వారందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి సంపదను సృష్టించే రాష్ట్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్నారని, వారు చేస్తున్న కృషికి ఆ యేసు ప్రభువు ఆశీస్సులు మెండుగా వుండాలని ప్రత్తిపాటి పుల్లారావు ఆకాంక్షించారు. క్రీస్తు ఆశీస్సులు వుంటే పెదవాళ్ళకు మంచి జరుగుతుందని,పేదరికం లేని రాష్ట్రం కోసం తపించేటటువంటి చంద్రబాబు లక్ష్యం నెరవేరుతుందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించిన ఎస్సీ సెల్ నాయకులను వారు పేరుపేరునా అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి , జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్,కొండా వీరయ్య, మద్దుమాల రవి, పంగులూరి వెంగళ రాయుడు,బడుగు జాకబ్ రాజు, శానం శ్రీనివాసరావు, జండ్రాజుపల్లి యేసయ్య, పిల్లి కోటి, కుళ్ళి పిచ్చయ్య,అడపా రాజు, గట్టుపల్లి మాణిక్యరావు, మూకిరి వీరాంజి, కొండేపాటి రమేష్, కుల్లి చిన్నబాబు,దార్ల సుబ్బారావు, శికా నాగరాజు,జింజి చిన్ని,వడ్డాని చిన్న, మచ్చా వెంకటేశ్వర్లు, కాసిమల్ల రాజు, దావల రవి,అల్లడి కోటిలింగం, అన్నల దాసు బుల్లి,మందా శివ, అరిగెల కోటి, రాయి సుబ్బారావు,టీడీపీ నాయకులు నెల్లూరి సదా శివరావు, షేక్ కరిమూల్ల, పఠాన్ సమద్ ఖాన్, క్లస్టర్ ఇంచార్జులు ,పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొనడం జరిగింది.