TEJA NEWS

సీఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి అధిక వడ్డీలకు ఆశపడి నష్టపోవద్దు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్ ప్రాంగణంలో పనిచేసే హమాలీలకు కారు డ్రైవర్లకు ఇతర జనాలకు, వడ్డీల పైన వచ్చే అనర్ధాలకు ఆన్లైన్ యాప్ లా జోలికి పోకూడదని సిఐ నాగార్జున వారికి క్లుప్తంగా వివరించారు, ఆన్లైన్ మోసాలపై అప్రపంతంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్ కార్డు నెంబర్ బ్యాంకు వివరాలు ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు అంటూ ఎవరైనా మీకు కాల్ చేసి రెండు మూడు లక్షలు లోన్ వస్తుంది మీ ఆధార్ నంబర్ ఓటిపి చెప్పండి అంటే వెంటనే స్థానిక పోలీస్ వారిని సంప్రదించాలి అంటూ సిఐ నాగార్జున తెలిపారు, ప్రజలకు ఆన్లైన్ మోసాల పైన బెట్టింగ్ యాప్ ల పైన సైబర్ నేరాల పైన వడ్డీల పైన వచ్చే అనర్థాలకు ఏ ఒక్కరు కూడా గురికాకూడదు అంటూ సి ఐ నాగార్జున వివరించారు.