పరిశ్రమలకు నీటి సరఫరా వెంటనే చేయాలి. సిఐటియు డిమాండ్.
పరవాడ ఫార్మాసిటీ పరిశ్రమలు 98 అచ్చుతాపురం 200 పరిశ్రమలు గత ఐదు రోజులుగా నీటి సరఫరా లేక ప్రవేట్ ట్యాంకర్లపై ఆధారపడి పరిశ్రమలను నడుపుతున్నారని వెంటనే ఏపీఐఐసీ అధికారులు నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడ ఫార్మసిటీలో ఆయన పర్యటించారు. పరిశ్రమలు నీటి కష్టాలను కార్మికులనుఅడిగి తెలుసుకున్నారు.
ఏపీఐఐసీ మరమ్మత్తులు గురైన మోటార్ రిపేరింగ్ చేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఏపీఐఐసీ అధికారులు నిర్లక్ష్యం రాంకీ యాజమాన్యం బాధ్యతారైథింగా వ్యవహరించడం వలన పరిశ్రమలకు నీటి కష్టాలు ఏర్పడ్డాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వీజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో పరిశ్రమలకు ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి కనీసం మౌలిక సదుపాయాలు నీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం అన్యాయం అన్నారు. ఉన్న పరిశ్రమలు కి నీరు కూడా అందించలేని పరిస్థితి ఏర్పడడం దుర్మార్గమన్నారు. పరిశ్రమలో ఒకవైపు నీరు లేక మూతపడుతున్నాయని కార్మికులు తగ్గిస్తున్నారని ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయని కొట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని మూడు మోటార్లను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని నీటి సరఫరాని వెంటనే ఇవ్వాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి వివి శ్రీనివాసరావు, ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగని శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు