TEJA NEWS

స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత
ముత్యాలమ్మపాలెం గ్రామ సభలో సర్పంచ్ చింతకాయల సూజాత ముత్యాలు.

పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీ లో
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామ సభలో మఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్,ఉమ్మడి జీల్లా పంచాయతీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు , చింతకాయల సూజాత ముత్యాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ
స్వచ్ఛతా హీ సేవతో గ్రామాల పరిశుభ్రత సాధ్యపడుతుందని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోదీ,మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ముత్యాలమ్మపాలెం గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పరిసరాల శుభ్రత పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉన్నపుడే గ్రామ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు,అనంతరం సిబ్బందితో స్వచ్ఛత హీ సేవా ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఎంపిటీసి అర్జిలి రవిదేవి ,మాజీ ఎంపిటీసి చింతకాయల అమ్మోరు, మాజీ కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ సూరాముత్యాలరావు ,పంచాయతీ కార్యదర్శి రమేష్ ,మరియు సచివాలయం సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS