సీఎం కప్ హాకీ ఉమ్మడి మహబూబ్నగర్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు బహుకరించిన……. రాచాల యుగందర్ గౌడ్
వనపర్తి
హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కప్ టోర్నమెంటులో పాల్గొనేందుకు విచ్చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా హాకీ జట్టుకు బిసి పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ గచ్చిబౌలి స్టేడియంలో క్రీడా దుస్తులను బహుకరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం పేరుతో నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నమెంటుకు సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ హాకీ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు.
రాష్ట్రస్థాయి హాకీ సీఎం కప్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బహుమతి పొందాలని ఆయన ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో వనపర్తి జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షులు పసుపుల మన్యం, ప్రధాన కార్యదర్శి బోలెమోని కుమార్ కోశాధికారి నిరంజన్ గౌడ్, సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అధ్యక్షులు గాలిగల్ల సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు అక్కల మహదేవన్ గౌడ్, సాయిబాబా, ఆనంద్, హాకీ క్రీడాకారులు పాల్గొన్నారు.