TEJA NEWS

ఇక నుంచి ఆన్ లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు

హైదరాబాద్ :
తెలంగాణ ప్రజలు ఇక నుంచి సీఎం సహాయనిధి అప్లికేషన్స్ ఆన్ లైన్లోనే స్వీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

సీఎం ఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహిం చాలని సీఎం రేవంత్ రెడ్డి, ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.దీనికోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఓ వెబ్ సైట్ ను ప్రత్యేకంగా రూపొందిం చారు.

సాయంత్రం సచివాలయంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టినట్లుగా పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఈ సారి ఈ విధానాన్ని రూపొందించా రు.ఇప్పటి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖా స్తులు ఈ వెబ్ సైట్లోనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

సీఎంఆర్ఎఫ్ కోసం తమ దగ్గరకు వచ్చే వారి వివరాలను తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్ లోడ్ చేయాలి. దర ఖాస్తుల్లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి గా ఉండాలి.

అప్ లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబం ధించి ఒక కోడ్ ను ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగానే ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందించాల్సి ఉంటుంది…


TEJA NEWS