
ఒకటో వార్డు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన…………….. మాజీ కౌన్సిలర్ చుక్క రాజు
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డుకు చెందిన బండారు శారదమ్మ వైఫ్ ఆఫ్ బండారు పుల్లయ్య లు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా అదే వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు సహకారంతో ఎమ్మెల్యే కృషి వల్ల అతి తక్కువ సమయంలో సీఎం సహాయనిధి నుండి లబ్ధిదారులకు చెక్కు విడుదల అయిందని ఈ మేరకు మంగళవారం చుక్క రాజు చేతుల మీదుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి చెక్కును అందజేయడం జరిగిందని ఈ పథకం అల్పాదాయ వర్గాలకు వరం లాంటిదని ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి పేరుతో అందివ్వడం నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెల్లుతుందని అది వనపర్తి యువ నాయకులు శాసనసభ్యులు తుడి మెగా రెడ్డి తో సత్సంబంధాలు ఉండడం చేతనే నియోజకవర్గంలోని ప్రజలకు త్వరితగతిన విడుదలవుతున్నాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత తొందరగా విడుదలయ్యేట్లు కృషిచేసిన వార్డు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు చుక్క రాజు కు ఎమ్మెల్యే తుడిమేగారెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వంశముని మోహన్ జేటి నరేష్ ఆర్టి కిరణ్ మండల యాది సుక్కయ్య శెట్టి గోకం ప్రేమ్ కుమార్ పోలేపల్లి మోహన్ రాజు తైలం సాయి పెద్దలు చుక్క రాములు బండారు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
