TEJA NEWS

కిడ్నీ బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా రూ.1.20 లక్షల చెక్కు పంపిణి

నందిగామ మండలం ఈదులపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ చారి అనే యువకుడు గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో 1 లక్ష 20 వేల రూపాయలు బాధితుడికి ప్రభుత్వం నుండి మంజూరయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతులమీదుగా క్యాంపు కార్యాలయంలో చెక్కును శ్రీనివాస్ చారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈదులపల్లి మాజీ సర్పంచ్ రాజు గౌడ్, రాయికల్ శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి తుపాకుల శేఖర్, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS