TEJA NEWS

ఇవ్వాళ రాత్రి జపాన్ పర్యటనకు వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి?

హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రానికి పెట్టబడును ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు ఈరోజు రాత్రి వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఈ నెల 16 నుంచి 22 వరకు అక్కడే పర్యటిస్తారు.

సీఎల్పీ సమావేశం అనంతరం అన్ని పనులు ముగించుకొని సీఎం జపాన్ వెళ్లనున్నారు. ఈ పర్యటన లో సీఎం తో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం జపాన్ పర్యటన కొనసాగనుంది.

అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పో లో సీఎం రేవంత్ పాల్గొనను న్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం జరగనుంది. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై జపాన్ వెళ్లిన సీఎం బృందం అధ్యయనం చేయనుంది.

తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగ స్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వ్యాపారవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వనించను న్నట్లు తెలుస్తుంది.