TEJA NEWS

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:జనవరి 22

సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డి కి దక్కుతుందని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆంగ్ల భాషను వ్యతిరేకించిన కేటీఆర్ పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు..


TEJA NEWS