TEJA NEWS

వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీకారం

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి తొలిసారి పర్యటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టారు.తొలుత హెలికాప్టర్​లో వేములవాడకు చేరుకున్న సీఎం రేవంత్​, వేములవాడ లో రాజన్నను దర్శించుకు న్నారు. అనంతరం ఆలయాభివృద్ది పనులు, రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని వర్చువ ల్‌గా ప్రారంభించారు.రూ. 235 కోట్లతో 4 వేల 696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితు లకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ చేశారు. రూ. 35 కోట్లతో చేపట్టే అన్నదాన సత్రం, రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ భవనం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనాన్ని సీఎం రేవంత్‌ ప్రారంభించారు.ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు రూ.85 లక్షల పరిహారం పంపిణీ చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి బహిరంగా సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.


TEJA NEWS