TEJA NEWS

బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

గోదావరి పరివాహక ప్రాంతంలోని,అలాగే తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను తెలంగాణ కంపెనీ ఆణిముత్యం సింగరేణికి కేటాయించకుండా వేలం ద్వారా కేటాయిస్తామని అందులో సింగరేణి కూడా పాల్గొనాలని చెప్పెడం సిగ్గుచేటని బొగ్గు గనులను ప్రైవేట్ పరం చెయ్యడాని నిరసిస్తూ నేడు మోడీ దిష్టిబొమ్మను జగతగిరిగుట్ట ఐలమ్మ విగ్రహం వద్ద దగ్ధం చెయ్యడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే టోల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందికి గురిచెయ్యడమే కాకుండా నేడు బొగ్గు గనులను ప్రైవేట్ వారికి దక్కేలా వేలం వెయ్యడం ద్వారా సింగరేణికి దక్కకుండా చెయ్యడం అన్యాయమని,సింగరేణికి బొగ్గు గనులు రాకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో సింగరేణి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అలా జరిగితే మొత్తం బొగ్గు గనులు ప్రైవేట్ పరం అయ్యి విద్యుత్తు భారం ప్రజల పై పడుతుందని కావున అలాంటి నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ప్రజలు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటికరణ వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి వ్యతిరేక పోరాటాలను నిర్వహిస్తేనే ప్రజలు ఇబ్బందులకు లోనుకారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇదే విదంగా మొండి వైఖరి వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్,ఏఐటీయూసీ అధ్యక్షుడు శ్రీనివాస్, మునిసిపల్ అధ్యక్షుడు రాములు,సీపీఐ నాయకులు సహదేవ్ రెడ్డి,ఇమామ్, యువజన సంఘం నాయకులు బాబు,నర్సింహారెడ్డి, రవి,వెంకటేష్, సీపీఐ నాయకులు సామెల్, ముసలెయ్య,ఆశయ్య, యాకన్న,యాదగిరి,లక్ష్మణ్,యాగంటి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS