TEJA NEWS

కుట్ర కోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి…

ఎన్నికల కమిషన్
అప్రమత్తం అవ్వాలి….

చిత్తూరు నుంచి రౌడీలు, అల్లరి మూకలను దింపి, భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారు…

సౌమ్యులుగా ఉన్న మా మీద ఏదో ఒక నెపం నెట్టాలని చూస్తున్నారు…

ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా అభ్యంతరం లేదు….

కానీ, స్థానిక పోలింగ్ బూత్ వద్ద కూర్చునే ఏజెంట్ అదే బూత్ పరిధిలో ఓటరై ఉండాలి….

25 మంది స్వతంత్ర అభర్థులకు తిరుపతి లో ఏజెంట్లను పెట్టుకునే శక్తి లేదు…

ఆ మాట కొస్తే మాకు పోటీగా నిలుచున్న జనసేన అభ్యర్థి కే మొత్తం అన్నీ బూత్ లలో ఏజెంట్లు నియమించుకునే అవకాశం లేని పరిస్థితి….

ఈ పరిస్థితి తెలిసి కూడా 25 మంది ఎందుకు చిత్తూరు కి చెందిన వారు తిరుపతి లో పోటీ చేస్తున్నారు అనే దగ్గరే కుట్ర దాగిఉంది…

ఎన్నికల కమిషన్ దీనిమీద ప్రత్యేక దృష్టి సారించాలి…..

వాళ్లు నియమించే ఏజెంట్లు, ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఓటరు అయ్యిండాలి…

చిత్తూరు నుంచి వచ్చే రౌడీలు, గూండాలు ఏజెంట్లుగా కూర్చోవడానికి వీళ్లేదు….

కానీ ఇటువంటి పరిస్థితి వస్తే అది సరైన పద్ధతి కాదు….

దీని మీద ఎన్నికల కమిషన్ సమగ్ర దర్యాప్తు చేసి, ఖచ్చితంగా ఆయా బూత్ పరిధిల్లో వారిని ఏజెంట్లుగా నియమించేలా చర్యలు చేపట్టాలి….

తిరుపతి లో శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి


TEJA NEWS