TEJA NEWS

రాజమండ్రి నుండి ఢిల్లీ కి విమాన సర్వీసును ప్రారంభించడం ద్వారా దేశ రాజధానిని మన గోదావరి ప్రాంతానికి అనుసంధానం చేసాము. ఇండిగో ఎయిర్‌లైన్స్ యొక్క ఎయిర్‌బస్ A-320 ఇక పై జాతీయ రాజధానిని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని మధ్య ప్రయాణికులకు సేవలు అందిస్తుంది.

మన ప్రధానమంత్రి శ్రీ @narendramodi ji మరియు గౌరవనీయులైన CM చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో, ఈ కొత్త విమానం ఆంధ్రప్రదేశ్‌కి మెరుగైన కనెక్టివిటీ, ఆర్థిక అవకాశాలు పెంపొందించడానికి దోహదపడుతుంది.

ఈ కార్యక్రమానికి మాతో పాటు పాల్గొన్న నాయకులు – ఎంపీ రాజమండ్రి శ్రీమతి. డి పురంధేశ్వరి , ఎంపి కాకినాడ టి ఉదయ్ శ్రీనివాస్ , ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ , ఆదిరెడ్డి శ్రీనివాస్ , గోరంట్ల బుచ్చయ్య చౌదరి , ముప్పిడి వెంకటేశ్వరరావు , నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి , ఎం వెంకటరాజు , జ్యోతుల నెహ్రూ తో పాటు రుడా ఛైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను .

రాజమండ్రి కొత్త శిఖరాలకు ఎగురుతున్నందుకు గర్వంగా ఉంది.


TEJA NEWS