TEJA NEWS

భూమి భుక్తి తెలంగాణ విముక్తికై పోరాడింది కమ్యూనిస్టులే సెప్టెంబర్ 17 వారసులు ఎర్ర జెండా బిడ్డలే.. సిపిఎం కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్
సెప్టెంబరు 17 తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా కుత్బుల్లాపూర్ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కీలుకానీ లక్ష్మణ్ అధ్యక్షతన షాపూర్ నగర్ శుభం హోటల్ దగ్గర సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించి పార్టీ జెండాని సీనియర్ నాయకులు జి వెంకన్న గారు ఆవిష్కరించినా అనంతరం పార్టీ మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ పోరాటం భూమి భుక్తి వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నవాబు దొరల జాగీర్దార్లు నిరంకుశ పరిపాలనపై తుపాకీ ఎక్కుపెట్టి బాంచన్ దొర కాలు మొక్కుతా అనే చేతుల తోటే బందుకు పట్టించిన చరిత్ర కమ్యూనిస్టులదని అలాంటి చరిత్రను వక్రీకరించి కొంతమంది మతోన్మాద శక్తులు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజల తిరుగుబాటుగా చిత్రీకరిస్తున్నారని ఇంకో బూర్జువా వర్గం తెలంగాణను విముక్తి చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలోని పటేల్ సైన్యం అని వక్రీకరిస్తున్నారని తెలంగాణన విముక్తి కొరకు భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం రావి నారాయణరెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి నల్ల నర్సింలు దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ నాయకత్వంలో వీరోచిత పోరాటం చేసి నిజాం సర్కార్ మెడలు వంచి భూమిలేని పేదలకు 10 లక్షల ఎకరాల భూమి పంచి 4000 మంది ప్రాణత్యాగం చేసింది కమ్యూనిస్టులేనని అలాంటి త్యాగాల్ని సమాజం గుర్తు పెట్టుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక కర్షక పేదలను సమీకరించి తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా పోరాడాలని అన్నారు
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జి వెంకన్న పార్టీ మండల కమిటీ సభ్యులు పి అంజయ్య పార్టీ నాయకులు
కే. శ్రీనివాస్ కరుణాకర్ దుర్గా నాయక్ భాష కృష్ణ ఏసు సత్యం తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
కీలుకానీ లక్ష్మణ్


TEJA NEWS