TEJA NEWS

ఊక చెట్టు వాగు పై వంతెన పూర్తి చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఆర్టిఐ యాక్టివిస్ట్ ఫోరం ఫిర్యాదు

తొమ్మిదేళ్ల క్రితమే వంతెన నిర్మాణానికి శంకుస్థాపన నేటికీ పూర్తవని పనులు

నీటి ఉధృతికి
ఆరుగురు మృతి
ప్రధాన పట్టణాలకు రాకపోకలు బంద్

వనపర్తి జిల్లాలోని మదనపురం మండలం వద్ద ఉన్న
ఊకచెట్టి వాగుకు వర్షాకాలంలో వరద వచ్చినప్పుడు వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది.దీనివలన గ్రామాల ప్రజలకు ప్రయాణాలకు ఆటంకాలుఏర్పడుతున్నాయి. దీంతో ఆత్మకూరు,అమరచింత, నారాయణపేట,చిన్నచింతకుంట, మరికల్, కొత్తకోట, మహబూబ్నగర్,మదనాపూర్‌ మండలాల్లోని ప్రజలకు జిల్లా కేంద్రానికి రాకపోకలు బంద్‌ అవుతున్నాయి.గత ప్రభుత్వం 2017 సంవత్సరాల కిందట వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు ఇప్పటివరకు అసంపూర్తిగానే మిగిలిపోయినారు.సాధారణంగా ఊకచెట్టి వాగుకు వర్షాధారంగా పై నుంచి వరదవస్తుంది.సరళాసాగర్‌ ప్రాజెక్టు నిండుకుని సైఫన్లు తెరుచుకుంటే రాకపోకలు పూర్తిగా బంధువుతాయి.కానీ గడిచిన కొన్నేళ్లుగా వర్షాలు ఎక్కువగాకురుస్తుండటంతోపాటు వరద కూడా ఎక్కువగా వస్తోంది.ఎగువ నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో సరళాసాగర్‌ సైఫన్లు పలుమార్లు తెరుచుకుని..

ఉకచెట్టి వాగుకు వరద తాకిడి పెరుగుతోంది.అలాగే కొత్తకోట మండలం కానాయపల్లిలో శంకరసముద్రం రిజర్వాయర్‌ వరద ప్రవాహం వస్తుంటాది.నూతన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించినా మారని పరిస్థితి 9ఏళ్లగా వంతెన నిర్మాణం కోసం ఎదురుచూపులే మిగిలాయి.వాగు ఉధృతికి గతంలో ఆరుగురు మృతి చెందారు.ఆ వంతెన పూర్తయితే..30 గ్రామాలకు మేలు జరుగుతుంది.ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు అనేకమార్లు ధర్నాలు,నిరసనలు చేశారు.ఇప్పటికైనా పనులు ప్రారంభించి,త్వరగా పూర్తి చేయాలని ప్రజావాణిలో కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులు కోరారు . ఈ కార్యక్రమంలోజి.రవికుమార్
ఆర్టిఐ RTI ఆక్టివిస్ట్స్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు మరియు బి. మహేందర్ నాయుడు ఆర్ టి ఐ, జిల్లా కోశాధికారి మరియు కావాలి అశోక్ కుమార్ మదనపురం మండల అధ్యక్షులు పాల్గొన్నారు