TEJA NEWS

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది

ఢిల్లీ: కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠ చూపిస్తోంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రజలకు రేవంత్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అటకెక్కించారని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో హామీల పేరిట అవినీతిలో కూరుకుపోయారని అన్నారు. తెలంగాణలో హైడ్రా పేరిట డ్రామా సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

హర్యానాలో కాంగ్రెస్ నేతలు 7 హామీలు అంటున్నారని… ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్‌ను నమ్మొద్దు అని చెప్పానని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికి ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.కొత్త కొత్త డ్రామాలు తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో మోసపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అంటే , కుటుంబం, బంధుప్రీతి, మైనార్టీ బుజ్జగింపులు, కులాల మతాల మధ్య చిచ్చుపెట్టే వాటికి కాంగ్రెస్ గుర్తింపు ఇస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలు అన్నారని. ఒక్కటి నెరవేర్చలేదని మండిపడ్డారు.


బీసీ , ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను ఓట్లకోసం నమ్మించి దగా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పూర్తిగా కాంగ్రెస్ ఫ్లౌప్ షో అయిందని విమర్శించారు. కౌలు రైతులకు రూ. 15 వేలు భరోసా అన్నారని నెరవేర్చలేదని చెప్పారు. రైతు బంధు పేరిట అన్ని బంధు పెట్టారన్నారు. గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలు అన్నారని కానీ అమలు చేయలేదన్నారు.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళలకు ఎన్నికల్లో ఏడాదికి లక్ష రూపాయలు అన్నారని అవి ఎప్పుడిస్తారో కూడా తెలియడం లేదన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయ్యిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి రావడానికే సరిపోతుంది కానీ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. జీతాల మందం అప్పులు తెస్తున్నారని అన్నారు. ప్రతి ఏడాది 6 లక్షల మంది విద్యార్థులకు డబ్బులు లోన్ రూపంలో ఇస్తామని చెప్పారని అన్నారు. రైతులకు ఇచ్చింది రూ. 17 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. మంత్రి భట్టి విక్రమార్క మొదటి విడతలో రూ. 15 వేల కోట్లు అన్నారన్నారు.
ఎంపీలు పార్లమెంట్‌లో తప్పుడు అంశాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ చట్టం తీసుకువస్తామని చెప్పారని అలా చేయలేదన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు చట్టం తీసుకురాలేదని ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. కేపి


TEJA NEWS