TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు

టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పీఎసీ ఛైర్మెన్ అరేఖపూడి గాంధీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి మదీనగూడ లోగల కినరా గ్రాండ్ బ్యాంక్వేట్ హల్ లో ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్పోర్ట్స్ అథారిటీ కౌన్సిల్ ఛైర్మెన్ శివసేన రెడ్డి , రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చల్లా నరసింహ రెడ్డి అధ్యక్షతన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ , మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , అల్విన్ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సమావేశంలో కార్పొరేటర్ మాట్లాడుతూ..పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు పార్టీ ఉంటుందన్నారు. కార్యకర్తలంతా సైనికుల్లా క్షేత్రస్థాయిలో కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, సీనియర్ నాయకులు మిర్యాల రాఘవరావు, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, సీనియర్ నాయకులు యాదా గౌడ్, కే రాంచందర్, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, గఫుర్, బాపునగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, గచ్చిబౌలి విలేజ్ ప్రెసిడెంట్ సయ్యద్ నయీమ్, రవీందర్, మల్లేష్, సుధాకర్ రెడ్డి, మహేష్ చారీ, షఫీ, ముక్రమ్, ఇర్ఫాన్, శశాంక్, తదితర డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.