
బాహ్య శత్రువుల కంటే, మన అంతర్గత అహంకారాన్ని జయించడం గొప్ప విజయం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి వివేకానంద్ …
130 – సుభాష్ నగర్ డివిజన్ సాయిబాబా నగర్ లోని “నక్షిణ్ బుద్ధ విహార్” దేవాలయంలో నిర్వహించిన బుద్ద జయంతి కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కోపంతో కాకుండా శాంతి, సహనంతో ప్రపంచాన్ని జయించవచ్చని, బాహ్య శత్రువుల కంటే, మన అంతర్గత అహంకారాన్ని జయించడం గొప్ప విజయమని మానవాళికి దిశానిర్దేశం చేసిన గొప్ప మార్గదర్శకులు గౌతమ బుద్ధుడు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, బుద్ధ దేవాలయం కమిటీ అధ్యక్షులు యశ్వంత్ జోన్డేల్, ఉపాధ్యక్షులు భీమ్ రావు కాండే, ప్రధాన కార్యదర్శి దిలీప్, జే. గౌతమ్, డబ్ల్యూ. దమ్మానం, కె. బాలాజీ, నాయకులు పెద్ద వెంకట స్వామి, గుబ్బల లక్ష్మీనారాయణ, కావలి రవి, వల్లీ భాయ్, జాంగీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
