TEJA NEWS

75వ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎంపీ డా. కడియం కావ్య ……

ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని, అలాంటి రాజ్యాంగాన్ని అందించిన ఘనత డా.బీఆర్‌ అంబేడ్కర్‌కే దక్కుతుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.

75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ భారత దేశానికి రాజ్యాంగము ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజాకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, స్వాతంత్ర్యానికి పూర్వం దేశ ప్రజలకు వలస పాలకుల, రాజరికపు పాలకుల పాలనలో కేవలం పాలకులు చెప్పిందే అమలు అయ్యేదని భారత రాజ్యంగము ఆమోదం ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రజలకు విద్య, వైద్య సదుపాయాలు హక్కుగా పొందే అవకాశంతో పాటు అనేక పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్ధిక హక్కులు ప్రజలకు భారత రాజ్యాంగము ఆమోదం ద్వారా రాజ్యాంగ నిర్మాతలు దేశ ప్రజలకు కల్పించారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో డా. బిఆర్.అంబేద్కర్ పాత్ర మరువలలేనిదని అన్నారు.


TEJA NEWS