TEJA NEWS

కట్టుడు పళ్ళ వైద్యరంగం అభివృద్ధికి దోహదపడుతుంది

ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్

దేశంలోనే కట్టుడు పళ్ళ వైద్యం రంగం అభివృద్ధికి దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. మంగళగిరి లోని సీకే కన్వెన్షన్ లో 52వ జాతీయ స్థాయి ఇండియన్ ప్రోస్థోడాంటిక్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం సదస్సు ప్రారంభమైంది. ఈనెల 24వ తేదీ వరకు జాతీయ కట్టుడు పళ్ళ వైద్య నిపుణుల సదస్సును మాట్లాడారు. ఈ సదస్సుకు ఐపిఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మనేష్ లహోరి, అధ్యక్షత వహించారు. మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ప్రోస్థోడాంటిక్ వైద్యం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

రాష్ట్రంలోని వైద్య విద్యార్థులు మరియు వైద్య నిపుణులకు ఇలాంటి కార్యక్రమాలు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు. ఐపీఎస్ జాతీయ కార్యదర్శి డాక్టర్ జంగల హరి మాట్లాడుతూ జాతీయ సదస్సులు పెట్టిన ప్రాంతంలో కాకుండా భారత దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సు సందర్భంగా అత్యాధునిక దంత వైద్య పరికరాలకు సంబంధించి 72 ప్రదర్శనలు ఏర్పాటు చేశామని అన్నారు. సుమారుగా 700 మంది వివిధ అంశాలపై ప్రశ్నాపత్రాలను ప్రజెంటేషన్ చేస్తారని ఆయన అన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది సీనియర్ ప్రముఖ వైద్యులు వివిధ అంశాలపై ప్రసంగిస్తారని ఆయన అన్నారు. ఐపీఎస్ ఆధ్వర్యంలో గిరిజన వెనుకబడిన ప్రాంతాలలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 2000 వేల మందికి పైగా ప్రోస్థోడాంటిక్ లు హాజరయ్యారని తెలిపారు. దేశ విదేశాల ప్రముఖ వైద్య నిపుణులు, పరిశోధకులు, హాజరై అనుభవాలు పంచుకుంటారని చెప్పారు. నూతన చికిత్స విధానాలు ఆధునిక పరికరాల ప్రదర్శనలు సదస్సులో ప్రత్యేకంగా నిలబడతాయ ఆయన తెలిపారు. వైద్య విద్యార్థులు తమ పరిశోధనలను ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తు వైద్య రంగానికి కొత్త మార్గాలను అన్వేషించనున్నారని చెప్పారు.ఈ సదస్సులో కాన్ఫరెన్స్ చైర్మన్ టి కృష్ణమోహన్, జాతీయ కోశాధికారి డాక్టర్ సంకేత్ రెడ్డి, ఆగమాన అధ్యక్షురాలు డాక్టర్ శిల్పి, జాయింట్ సెక్రెటరీ డాక్టర్ శేషారెడ్డి, ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ విజయ శంకర్, కార్యదర్శి డాక్టర్ భవన్ చంద్, డాక్టర్ చక్రవర్తి, సందీప్ చిరమన, డాక్టర్ రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS