TEJA NEWS

ఎంపిపిఎస్ పాఠశాల వార్షికోత్సవంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నాణ్యమైన విద్యతో పాటు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోగల మసీద్బండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం పాఠశాల హెచ్ఎం వారి బృందం కార్పొరేటర్ ని శాలువా కప్పి షీల్డ్ బహుకరించి సత్కరించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… తన డివిజన్ లోగల సురభి కాలనీలోని చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఆనాడు స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ శ్రీమతి అండ్ రాగం సుజాత నాగేందర్ యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించబడిన ఎంపీపీఎస్ పాఠశాలలోని విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నతమైన చదువులు చదవడానికి దోహదపడుతున్నారని చదువు పట్ల తమకున్న అపారమైన ప్రేమ, గౌరవమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు బాగా పనిచేస్తున్నాయని నాణ్యమైన విద్యతో పాటు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులలో చదువుతోపాటు క్రమశిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తుందని ప్రభుత్వ పాఠశాలలో పటిష్టంగా పనిచేస్తున్నాయని అన్నారు.

చదువుతోపాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలని అన్ని రంగాలలో రాణించాలని విద్యార్థి దశ నుండి సామాజిక స్పృహ లక్ష్యాలను అలవర్చుకోవాలని, ఇతరులకు సహాయపడే గుణమును పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల ఎంఈఓ వెంకటయ్య, సదానంద యాదవ్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ ఉమాదేవి, PRTU TS జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, గౌరవ అధ్యక్షులు రాఘవేందర్, మండల PRTU TS అధ్యక్షులు హనుమంతు, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, దర్గా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తాజ్ బాబు, శేర్లింగంపల్లి కాంప్లెక్స్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బల్వంత్ రెడ్డి, కొండాపూర్ పాఠశాల మాజీ హెడ్మాస్టర్ పల్లె అనంతరెడ్డి, యూసుఫ్, సురభి కాలనీ ఎంపీపీఎస్ హెచ్ఎం పాండురంగారెడ్డి, కొండాపూర్ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు వారి తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.