
కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ కృషితో అల్లాపూర్ లో ముంప్పు సమస్యకు చెక్…
కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ డివిజన్లోని సబ్ధర్ నగర్ లో పర్యటించి… లక్ష్మీ నగర్ నుండి యూసుఫ్ నగర్ మీదుగా సబ్ధర్ నగర్ వరకు ప్రవహించే స్ట్రామ్ వాటర్ నాల ద్వారా వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై ముందే దృష్టి పెట్టిన కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ … వరద ముంపు సమస్య రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటున్నారు… జీహెచ్ఎంసీ ఎస్ ఎన్ డి పి అధికారులు Ee శ్రీనాథ్ రెడ్డి, De రాజ్యలక్ష్మి, లతో కలిసి డివిజన్ లో పర్యటిస్తూ… కాలనీవాసులతో మాట్లాడి ఎక్కడెక్కడ వరద సమస్య తలెత్తుందో తెలుసుకుని నివారణ చర్యలు చేపడుతున్నారు…
డివిజన్ లో కీలకంగా ఉన్న సబ్దర్ నగర్ నాలా విస్తరణ పనులను పరిశీలించారు. వర్షాలు మొదలయ్యేనాటికి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సఫ్దర్ నగర్ నాలా విస్తరణతో సున్నం చెరువు, మైసమ్మ చెరువుల నుంచి వచ్చే వరద ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ఆకాంక్షించారు. వరద సమస్యలు రాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్న కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ కి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చిన్నపాటి వర్షానికే కాలనీలు నీట మునిగేవని కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ కృషితో చాలా వరకు ముంప్పు సమస్య తప్పుతుందని కాలనీవాసులు చెప్పారు. నాలా విస్తరణతో వరద సమస్యకు చెక్ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ హమీద్, సయ్యద్ రియాజ్, అస్లం బేగ్, బాబా, మల్లేష్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
