TEJA NEWS

Corporator Venkatesh Goud inspected the CC road construction works

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 డివిజన్ పరిధిలోని ఛత్రపతి శివాజీ నగర్లో రోడ్డు నెంబర్ 1 మరియు రోడ్డు నెంబర్ 4 లో సీసీ రోడ్ల కొరకు గతంలో పదిహేను లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు పూర్తయిన మరియు నిర్మాణ దశలో ఉన్న రెండు గల్లీలలోని సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే నిర్మాణ పనులు పూర్తయిన సీసీ రోడ్డును మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. నూతన సీసీ రోడ్లు నిర్మించినందుకు కాలనీ వాసులందరు హర్షం వ్యక్తం చేసి కార్పొరేటర్ గారికి కృతజ్ఞతలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, అంజయ్య యాదవ్, బాలరాజు, కె.రమేష్, పోశెట్టిగౌడ్, రాజేందర్, పదయ్య, పోచయ్య, ఎల్.రాజు, తాతబాబు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS