TEJA NEWS

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ ఫేస్ 2 లో సీసీ రోడ్ల కొరకు గతంలో నలభై లక్షల రూపయులు నిధులు మంజూరై, ఇప్పుడు నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా సిసి రోడ్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో CH. భాస్కర్, అగ్రవాసు, సంగమేష్, మోజెస్, శ్రీనివాస్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.


TEJA NEWS